ప్రతీకారేచ్ఛ
హోర్ముజ్ మూసివేత కొనసాగుతుంది
గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు ఆపేది లేదు
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముజ్తాబా ప్రకటన
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఆయతుల్లా ముజ్తాబా ఖమేనీ తొలిసారిగా ఒక ప్రకటన చేశారు. తమ శ్ర తువులపై ఒత్తిడి పెంచేందుకు హోర్ము జ్ జలసంధిని మూసివేసినట్లు, అది అలాగే కొనసాగించినున్నట్లు చెప్పా రు. గల్ఫ్‌దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు.
పొరుగున ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ తక్షణమే మూసేయాలని ఖమేనీ హెచ్చరించారు. మినాబ్ పాఠశాలపై దాడి సహా అనేక హింసాత్మక ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటనను ఇరాన్ అధికారిక టీవీలో గురువారం ప్రసారం చేశారు. తమ పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను ఇరాన్ విశ్వసిస్తోందని, అయితే అవి అమెరికాకు వత్తాసు పలుకుతూ, అమెరికా స్థావరాలను కొనసాగిస్తే తగిన మూల్యం తప్పదని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా దా డులు ప్రారంభించిన సమయంలోనే ముజ్తాబా ఖమేనీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.




