కలెక్టరేట్‌లో ఇంటర్నెట్ కటకట
నిర్మల్, మే 18 (విజయక్రాంతి) : పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంలో ఇంటర్నెట్ సేవలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. గత ఆరు నెలల నుంచి కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సేవలు హై స్పీడ్ డేటా రాకపోవడంతో అధికారులు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కలెక్టర్ కార్యాలయంలో మొత్తం 52 శాఖలు ఉండగా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వివిధ నెట్వర్క్ లను వినియోగిస్తున్నారు.
వారికి ఈ నెట్వర్క్ సంబంధించిన సేవలు అందడం లేదు. కలెక్టరేట్లో ఐ ఫై ఉన్న తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితిలో ఇంటర్నెట్ వినియోగించవలసి వస్తే సిబ్బంది బయటకు వచ్చి ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్న అక్కడ కూడా సరిగ్గా రావడంలేదని కలెక్టర్ కారుల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు కోసం కలెక్టర్ కార్యాలయంలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మించిన అది తాత్కాలికంగా పనులు ఆగిపోవడంతో వెంటనే పనులు ప్రారంభించి ఇంటర్నెట్ సేవలపై దృష్టి పెట్టాలని జిల్లా ఉద్యోగులు ప్రజలు కోరుతున్నారు






