19 May, 2026 | 2:11 AM

కేటీఆర్.. చట్టాలపై అవగాహన ఉందా?

19-05-2026 12:00 AM

టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి 

ఎల్బీనగర్, మే 18: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మంత్రిగా పనిచేసిన మీకు చట్టాలపై అవగాహన ఉందా?, బండి సంజ య్ కుమారుడి కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని టీ పీసీసీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.

సోమవారం ఎల్బీనగర్‌లో ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... బండి భగీరథ్ కేసులో ముఖ్యమం త్రి ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు అంటున్నావు?, మైనర్ ఉన్నది కాబట్టి కొన్ని లీగల్‌గా చేయాల్సి ఉన్నది, ఈ విషయాలు మంత్రిగా పనిచేసిన మీకు తెలియకపోతే ఎట్లా అని ప్రశ్నించారు. బీజేపీ రేపులను ఎంటర్‌టైన్ చేస్తే... బీఆర్‌ఎస్ డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మొస్తుండని ఆరోపణలు చేస్తున్నప్పుడు... మేము కూడా ఆరోపణలు చేస్తున్నాము.. మీరు ఎల్బీనగర్ లో వచ్చింది... డ్రగ్స్ పెడ్లర్స్ దగ్గర మామూళ్లు తీసుకెళ్లడానికి వస్తున్నారని అంటున్నాం.. మీరు యాక్సెప్ట్ చేస్తారా... అని ప్రశ్నించారు. నీట్ పరీక్ష లీకేజీ విషయంలో పార్జీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో ఎవరైనా సరే అడ్డగోలు పోస్టులు, కామెంట్స్ పెడితే ఎవరిని వదిలిపెట్టలేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఉమేష్ సింగ్, విష్ణు, రోహిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.