8 August, 2026 | 9:11 PM

చలో కొత్తగూడెం.. చలో చలో అంతర్జాతీయ ఆదివాసి గిరిజన దినోత్సవ సభ

08-08-2026 02:30 PM

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ మండలం రూరల్ ఏజెన్సీ గ్రామపంచాయతీలు కోడిపుంజుల వాగు పూసల తండా పాండ్రంగాపురం కొత్త సూరారం బిక్కుతండా వీరు నాయక్ తండ రంగాపురం కొత్త కాలనీ గ్రామపంచాయతీ లో లంబాడి హక్కుల పోరాట సమితి భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి కుశ నాయక్ కొత్తగూడెం క్లబ్బులో జరిగే సభకు లంబాడా యువత రైతులు విద్యార్థిసంఘ నాయకులు ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు లు తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని శనివారం విస్తృత పర్యటన నిర్వహించారు.

 గ్రామపంచాయతీ సర్పంచులను Ex ఎంపిటిసి గ్రామస్తులను చైతన్యపరిచి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వినోద్ నాయక్, జగదీష్ నాయక్, సంతోష్ నాయక్, హీరా లాల్ నాయక్ ,లాల్ సింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్l లను కలిశారు.  ఆదివారం  కొత్తగూడెం క్లబ్ లో సభ నిర్వహించబడుతుంది, గిరిజన హక్కులు పరిరక్షణకై మనతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

* తండా గ్రామపంచాయతీలను - రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి, తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి.

ST లు సాగు చేస్తున్న లావణి, సీలింగ్, పోడు భూములకు శాశ్వతంగా పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలి.

రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం రిజర్వేషన్ ST లకు రాష్టంలో అమలు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన అంశాలు:-

ST ల రిజర్వేషన్ను, కేంద్ర ప్రభుత్వం 7.5% శాతంను పెరిగిన జనాభా ఆధారంగా 14% కి పెంచాలి.

ST లంబాడీ గోర్బోలి భాషను అధికారికంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం 8వ షెడ్యూల్లో చేర్చాలి.

STల 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి.

దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను ST జాబితాలో చేర్చాలి. 

పై అంశాలపై కేంద్రంలో ఉన్న  బి జె పి ప్రభుత్వంపై వొత్తిడి చేసి, పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడి పరిష్కార దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.