గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు
24-08-2026 11:08 AM
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సిఓఈ కళాశాలలో కొందరు విద్యార్థులు గోడ దూకి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. కళాశాలలో ఇంటర్ సెకండీయర్ చదువుతున్న విద్యార్థులు అధ్యాపకుల కొరత పై సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి భాగ్యనగర్ రైలు ఎక్కెందుకు ప్రయత్నించారనీ సమాచారం. విద్యార్థుల వెళ్లిన ఘటనా సమాచారాన్ని కళాశాల అధ్యాపకులు పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరిగి విద్యార్థులు కళాలకు చెరుకున్నారు. అధ్యాపకులు విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కళాశాలలో అలజడి సద్దుమణిగింది. అయితే విద్యార్థులు గోడ దూకి బయటికి వెళ్లిన సంఘటన అధ్యాపకుల్లో ఆందోళన రేకెత్తించింది.






