24 August, 2026 | 1:32 PM

తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

24-08-2026 12:12 PM

చిట్యాల, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మునుగోడు–చిట్యాల ఆటో యూనియన్‌కు చెందిన వెంబావి గ్రామానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ ఇరుగదిండ్ల శేఖర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన సహచర ఆటో డ్రైవర్లు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. శేఖర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, యూనియన్ సభ్యులంతా కలిసి ఆయన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. శేఖర్ ఆకస్మిక మృతి తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఆయన కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం బాధ్యతగా భావించి ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పానుగుల్ల బుచ్చి రాములు, ఉపాధ్యక్షులు దొడ్డి శ్యామ్, జోగులింగస్వామి, సభ్యులు నక్క సైదులు, నీలం శివ, బత్తుల జనార్ధన్, జానయ్య, కొమ్మనపల్లి యాదయ్య, బత్తుల వెంకన్న, బత్తుల వెంకటయ్య, జోగు చిరంజీవి, జోగు నరేష్, భగవంతు తదితరులు పాల్గొన్నారు.