24 August, 2026 | 12:46 PM

Feesula Bakai - BJP Ladayi: ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు నిరాహార దీక్ష

24-08-2026 11:50 AM

ప్రారంభమైన బీజేపీ నిరాహార దీక్ష

దీక్ష చేపట్టిన రాంచందర్ రావు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramchander Rao hunger strike) ఆధ్వర్యంలో "ఫీజుల బకాయి - బీజేపీ పోరాటం" పేరుతో రెండు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షలో బీజేపీఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష ముగియనుంది. ఫీజు రీఎంబర్స్ మెంట్(Fee Reimbursement) బకాయిలపై బీజేపీ నిరాహార దీక్షకు దిగింది.

సొంత పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పలు తప్పడం లేదు. పార్టీ లైన్ దాడి ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అంతర్గత కుమ్ములాటలతో రేవంత్ రెడ్డి పతనం తప్పదని బీజేపీ జోస్యం చెప్పింది. కాంగ్రెస్ అంటేనే పదవుల కోసం పాకులాట, కమీషన్ల కొట్లాటఅని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు విద్యార్థుల సమస్యలపై ఎక్కడో మీటింగ్ లు పెట్టడం కాదు.. దమ్ముంటే హైదరాబాద్ వచ్చి విద్యార్థుల సమస్యలపై చర్చ పెట్టాలని సవాల్ చేశారు.