గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు
21-08-2026 09:08 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలుర)లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్ రావు శుక్రవారం తెలిపారు. ఎంపీసీ, బైపిసి గ్రూపుల్లో ఎస్సీ, ఎస్టి కేటగిరీలకు సీట్లు అందుబాటులో ఉన్నాయనిపేర్కొన్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు తమ అసలు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లను అర్హత నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.






