5 May, 2026 | 8:41 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి

28-02-2026 02:08 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఫిబ్రవరి 27(విజయ క్రాంతి) :ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.

 మూడవ రోజు ప్రశాంతంగా మొదటి సంవత్సర పరీక్షలు: -ఇంటర్మీడియట్ విద్యాధికారి- మాధవి 

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఇంగ్లీష్ పరీక్షలు జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 5877 గాను 5716 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 608 గాను 589 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.

జిల్లాలో మూడవ రోజు హాజరు శాతం 97.25 శాతం గా నమోదైంది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించారు.