1 June, 2026 | 9:20 PM

ఘనంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

01-06-2026 08:26 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ గుడి సెంటర్‌లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా సేవలో ముందుండి పనిచేస్తున్న ఇద్దరు నాయకులు ఆయురారోగ్యాలతో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.