18 April, 2026 | 11:10 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

దేవాలయంపై శంకు, చక్రాల స్థాపన

19-02-2026 12:48 AM

చిట్యాల, ఫిబ్రవరి18 : పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం దంపతులు బుధవారం పాల్గొన్నారు.

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో శ్రీ శ్రీ భూ సమేత తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 26న ఘనంగా నిర్వహిస్తున్నామని, 27న రథోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయంపై శంకు చక్రాల స్థాపన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమం, పూజా కార్యక్రమాలలో శంకు చక్రాల దాత  సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పద్మ యాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హోమం కార్యక్రమంలో పాల్గొన్న గుడి చైర్మన్ ఓర్సు రాజకుమార్ దంపతులు, ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను శ్రీ, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ చలమల్ల, మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకురు యాదయ్య, సాగర్ల నవ్య శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ ముఖ్య నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.