21 August, 2026 | 2:33 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు బారికేడ్ల ఏర్పాటు

21-08-2026 01:38 AM

నంగునూరు, ఆగస్టు 20 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట హనుమకొండ రాజీవ్ రహదారి పై రాంపూర్ చౌరస్తా వద్ద గురువారం బారికేడ్ల ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సీఐ విద్యాసాగర్ రావు,రాజగోపాలపేట ఎస్‌ఐ టీ.వివేక్ లు  మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా స్పందించి రోడ్డు భద్రతకు సహకరించిన వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్,వైస్ చైర్మన్ నూకల భాస్కర్,సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వాహనాల వేగ నియంత్రణకు బారికేడ్లు ఎంతో అవసరమని భావించిన నిర్వాహకులు,తమ సొంత ఖర్చులతో వీటిని సిద్ధం చేయడం జీవితాలను కాపాడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోక మైపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అనగోని లింగంగౌడ్,ఉప సర్పంచ్ తిరుపతి గౌడ్, వార్డు మెంబర్ నాంపల్లి వెంకటేష్,శ్రీనివాస్ గౌడ్, స్వామి,మహేష్, శివకుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కృష్ణమూర్తి, యాదగిరి, స్వామి,రమేష్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.