విద్యుత్ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్,ఆగస్టు 20(విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న వి ద్యుత్ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు విద్యుత్ శాఖ హైదరాబాద్ సెంట్రల్ ఆపరేషన్ సూపరింటిండెంట్ ఇంజనీర్ రమేశ్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని అన్ని డివిజనుల్లో నెలకొన్న విద్యుత్ సరఫరా సమస్యలు,కరెంట్ పోల్స్ షిఫ్టింగ్ వంటి సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ బీజే ఆర్ నగర్లో విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్, న్యూ సి బిఐ క్వార్టర్స్లో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫినిషింగ్ పనులు, అవసరమైన చోట్ల కరెంట్ పోల్స్ షిఫ్టింగ్, ఐరన్ పోల్స్ స్థానంలో సిమెంట్ కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అన్ని డివిజనుల్లో పెం డింగ్లో ఉన్న విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారిని గోవర్ధన్ రెడ్డిని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను చేపట్టాలన్నారు. అధికారులు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.






