29 March, 2026 | 3:22 AM

సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి

29-03-2026 01:43 AM
  1. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

తన నివాసంపై ఏర్పాటు 

కరీంనగర్, మార్చి 28(విజయక్రాంతి): రాష్ట్రంలోని వార్డు మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తమ ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మే రకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంపై సోలార్ ప్యానెల్ ను ఏర్పా టు చేసుకున్నారు.

శనివారం టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్‌తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. అధికారులు రూపొందించిన ‘ప్రధా నమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు.అందుకోసం 75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్లు తెలిపారు.  కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెడతామన్నారు.

ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూని ట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 5 నుండి 7 వేల కుటుంబాలు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సరిపడా కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.

అందుకే ప్రజలందరు ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటే..అందుకయ్యే వ్యయంలో 30 వేల నుండి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు. నా ఇంటి విద్యు త్ బిల్లులు ప్రతినెలా 25 నుంచి 30 వేలు ఖర్చు వస్తోందని,ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా ఇకపై బిల్లులు 5 వేలలోపే వచ్చే అవకాశముందన్నారు.