29 March, 2026 | 3:22 AM

లోక్ అదాలత్‌లో 81,078 కేసులు పరిష్కారం

29-03-2026 01:42 AM

రూ.34.54 లక్షల పరిహారం

కుషాయిగూడ, మార్చి 28 (విజయ క్రాంతి) : జాతీయ న్యాయ సేవాధికార సం స్థ, న్యూ ఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మల్కాజిగిరి ఆధ్వర్యంలో కుషాయిగూడ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం ఘనం గా నిర్వహించారు.

ఈ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వి. బాల భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యా య సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగి న కేసులను సులభంగా, వేగంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 బెంచ్ల లో మొత్తం 39 సివిల్ కేసులు, 81,007 క్రిమినల్ కేసులు పరిష్కరించబడినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా బ్యాంకులు, బిఎస్‌ఎన్ ఎల్కు సంబంధించిన 32 ప్రీ-లిటిగేషన్ కేసులు కూడా పరిష్కారం పొందాయి. ఈ లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ. 34,54,988 పరిహారం కిం ద చెల్లించబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య, న్యాయవాదులు, పోలీసు సిబ్బం ది, బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.