20 July, 2026 | 6:04 PM

మల్లారెడ్డి యూనివర్సిటీలో తనిఖీలు

20-07-2026 12:24 AM

మేడ్చల్, జూలై 19(విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో జేఎన్టీయూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో తనిఖీలు నిర్వహించి ఈనెల 24 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

దీంతో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. అధికారుల బృందం ల్యాబులు, తరగతి గదులు ఉన్నాయా, ఏ ఐ సి టి ఈ అనుమతి లేకుండా సీట్లు పెంచారా, ఏ ఐ సి టి ఈ కి ఇచ్చిన సమాచారం నిజమేనా, ఫీజు బకాయి ఉందని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆపడం వంటివి చేశారా పరిశీలించింది. అంతేగాక అక్రమ నిర్మాణాలు, శిఖరం భూముల కబ్జా వంటివి కూడా పరిశీలించింది.