రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఉచిత పీజీ కోచింగ్
ఎంఏ తెలుగు ప్రవేశ శిక్షణ ప్రారంభం
మంచిర్యాల టౌన్, మే 12 : మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉచిత పీజీ ప్రవేశ పరీక్షతో పాటు యోగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. మం చిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, కాగజ్ నగర్, జగిత్యాల మహిళా కళాశాలల తెలుగు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రా ష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఉచిత ఎంఏ తెలుగు ఎంట్రన్స్ ఆన్ లైన్ కోచింగ్ ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తె లుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ పిల్లలమఱ్ఱి రాములు ఆన్ లైన్ లో ప్రారంభించి మాట్లాడారు.
కోచింగ్ ద్వారా ప్రామాణికమైన పు స్తకాల జ్ఞానం, నాణ్యమైన బోధన లభిస్తుందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చే సుకోవాలన్నారు. తెలంగాణలో ప్రముఖ వి శ్వవిద్యాలయాల్లో చదువుకున్న, సుదీర్ఘ అ నుభవం ఉన్న అధ్యాపకులు పాఠాలు బోధిస్తారని, విద్యార్థులు తమ అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చన్నారు. నెల రోజుల పాటు ఆన్ లైన్ లో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంత విద్యార్థి అయినా ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నారు.
యోగతో పరిపూర్ణ ఆరోగ్యం
నిత్యజీవితంలో యోగతో పరిపూర్ణమైన ఆరోగ్యం ఏర్పడుతుందని యోగా గురువు మందాల చైతన్య సుధా అన్నారు. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత యోగ శిక్షణను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. యోగాసనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిసాన్ ఓజా, లక్షెట్టిపేట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్, డాక్టర్ తన్నీరు సురేష్, డాక్టర్ శ్రీధర హరీష్, డాక్టర్ గోలి శ్రీలత, డాక్టర్ లక్మీ నరసింహం, డాక్ట్ పట్వర్ధన్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.






