విద్యార్థి ప్రతిభ.. పొడువును కొలిచే పరికరం..
"కూసుమంచి "గ్లోబల్ రెయిన్బో" విద్యార్థి వినూత్న ఆవిష్కరణ
కూసుమంచి, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో గల గ్లోబల్ రెయిన్బో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి. యశ్వంత్ తన ప్రతిభను చాటుతూ సెన్సార్ సాంకేతికత ఆధారంగా పొడవును కొలిచే ఒక వినూత్న పరికరాన్ని ఉపాధ్యాయుల సహాయంతో రూపొందించాడు. ఈ పరికరం ద్వారా ఒక వస్తువు పొడవును,ఒక ప్రదేశం ,పొడవును అత్యంత సులభంగా, వేగంగా కొలవవచ్చు. కొలిచిన పొడవు ను నేరుగా డిజిటల్ డిస్ప్లేపై కనిపించేలా దీనిని రూపొందించడం విశేషం.ఈ పరికరం గరిష్ఠంగా 5 మీటర్ల వరకు పొడవున కచ్చితంగా కొలిచి డిస్ప్లేలో చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఆధునిక సెన్సార్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ ఆవిష్కరణ విద్యార్థి సృజనాత్మకతకు, శాస్త్రీయ ఆలోచనా విధానానికి నిదర్శనంగా నిలిచింది. దీనిని 800/- రూ|| ఖర్చు తో రూపొందించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎండీ ఏర్షాద్ అహ్మద్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ, చిన్న వయస్సులోనే ఇలాంటి వినూత్న ఆవిష్కరణ చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు "గ్లోబల్ రెయిన్బో పాఠశాల" ఎల్లప్పుడూ ముందువుంటుందని తెలిపారు.భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసి పాఠశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని అభినందిస్తూ అతని ప్రతిభకు శుభాకాంక్షలు తెలిపారు.






