కుల గణనలో ముస్లింలకు అన్యాయం
ఉపకులాల లెక్కల్లో గందరగోళం
మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన కుల గణన వివరాల్లో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
బీసీ ముస్లింలలోని 14 వర్గాలకు చెందిన 64 ఉపకులాల జనాభా 35,76,588 (10.08శాతం)గా చూపించగా, ఓసీ ముస్లింల జనాభాను 8,80,424 (2.48శాతం)గా చూపించి, రాష్ట్రంలోని మొత్తం ముస్లిం జనాభా 44,57,012 మంది (12.56 శాతం) ప్రకటించడం సరైంది కాదన్నారు. ఓసీ ముస్లింలలో సయ్యద్, ముషైక్, మొఘల్, పఠాన్, ఇరానీ తదితర మొత్తం 16 ఉపకులాలు ఉన్నప్పటికీ, ఉపకులాలవారీగా లెక్కింపు చేయకుండా మొత్తం 2.48 శాతంగా చూపించడం ము స్లింల ను తప్పుదారి పట్టించే చర్య అని విమర్శించారు.






