6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

రెమినేషన్ చెల్లించడంలో అన్యాయం

12-02-2026 12:50 PM

సి.పి. యస్.ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు

నిర్మల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి పూర్తి రెమ్యునరేషన్ చెల్లించకుండా కోత విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికారులు హుందాగా వ్యవరించాలని సి.పి. యస్.ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు పేర్కొన్నారు. అనేక ఇబ్బందుల మధ్యన విధులు నిర్వహించి,ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసి,ప్రభుత్వ ప్రతిష్ట పెంచామని.. అయినా కూడా కొందరు అధికారులు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ను తగ్గించి ఇవ్వడం సబబు కాదని అన్నారు. ఎన్నికల వచ్చినప్పుడల్లా అధికారుల తీరుతో విసిగి పోతున్నామని అన్నారు.

పూర్తి రెమ్యునరేషన్ ను ఉపాధ్యాయులకు వీలైనంత తొందరలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రులకు ,అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొన్ని చోట్ల సిబ్బందికి సరైన భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ఇలాంటి విషయాల్లో హుందాగా ఉండాలని కోరారు. రాత్రి వరకు విధుల్లో ఉన్న సిబ్బంది అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు.