11 April, 2026 | 4:04 AM

బీసీల సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి

11-04-2026 01:43 AM

సీఎం చంద్రబాబుకు సచివాలయంలో వినతిపత్రం సమర్పించిన బీసీ నాయకులు

అమరావతి, ఏప్రిల్ 10(విజయక్రాంతి): బీసీల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చొరవచూపాలని, వారి అభివృద్ధికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంక ర్‌రావులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ డిమాండ్లపై సీఎం చంద్రబాబు నాయు డు సానుకూలంగా స్పందించారని తెలిపారు. దేశస్థాయిలో బీసీ సమస్యల పరిష్కా రం కోసం ప్రధానితో చర్చిస్తానని, సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారని తెలిపారు.

శుక్రవా రం సీఎం చంద్రబాబును ఏపీ సచివాలయంలో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని బీసీ సంఘం నాయకులు అందజేశారు. అనంతరం సీఎంతో సుధీర్ఘంగా భేటీ అయి పలు అంశాలపై చర్చిం చారు. కులగణన, బీసీ మహిళలకు సబ్‌కోటా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై విధిం చిన 50 శాతం పరిమితి ఎత్తివేత, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పెంపు, బీసీరక్షణ చట్టం, మహాత్మా జ్యోతిబా ఫూలే స్మృతివనం ఏర్పాటు తదితర అంశాల్లో బీసీల సమస్యల పరిష్కారానికి సహకరించాలని సీఎంను కోరారు.