12 April, 2026 | 4:46 AM

శ్రీదత్త విద్యాసంస్థల్లో ఘనంగా ఇన్‌ఫినిటీ

12-04-2026 12:52 AM
  1. విద్యతోపాటు నైతిక విలువలు కలిగి ఉండాలి

విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పాండురంగారెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 11(విజయక్రాంతి) : శేరిగూడలోని శ్రీదత్త విద్యాసంస్థ ల్లో ఘనంగా ఇన్‌ఫినిటీ 2026, 25వ వార్షికోత్స ముగింపు కార్యక్రమంగా శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీదత్త విద్యా సం స్థల వ్యవస్థాపకులు పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ఎస్‌ఎన్‌వీ వైభవ్ రెడ్డి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర దేవేంద్ర విడమీరెడ్డి, శ్రీద త్త గ్రూప్ డైరెక్టర్ సంతోష్ డుమారీ పాత్ర, రిటైర్డ్ తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వైజయంతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ వి ద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, విధేయతలు కలిగి ఉండాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యలో నైపుణ్యం పెంపొందించుకో వాలని అన్నారు. భవిష్యత్‌లో గొప్ప శస్త్రవేత్తల ను తయారు చేయడమే శ్రీ దత్త విద్యా సంస్థల ముఖ్య లక్ష్యమని తెలిపారు.వైస్ చైర్మ న్ వైభవ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మేదస్సు జాగృత్తి పరిచే దిశగా ట్రైనింగ్ ప్రోగాం నిర్వహిస్తున్నామన్నారు.

చివరి ము గింపు రోజు సాంస్కృతిక కార్యక్రమం కావడంతో ఫోక్ సింగర్ మంగ్లీ తన బృందంతో పాల్గొన్ని.. విద్యార్థులను తన పాటలతో ఊ ర్రూతలించారు.శ్రీదత్త విద్యార్థులు నృత్యాలతో పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపాల్స్ డాక్టరీ సెంథిల్ కుమా ర్, డాక్టర్ మధుకర్, డాక్టర్ ఉమమనోశ్వరరావు, డానీ అకాడమిక్స్ డాక్టర్  అచ్యుతరా వు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.