పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రుద్రంగి జూన్ 02(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న సామూహిక ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా రుదంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు..
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్
పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయని తెలిపారు..రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ,మండల అధ్యక్షుడు గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్,కోమిరే శంకర్,పుట్కాపు మహిపాల్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు






