రాష్ట్రస్థాయి స్పెల్ బీ పోటీల్లో ఐపీఎస్ పాఠశాల విద్యార్థుల సత్తా
విద్యార్థులను అభినందించిన చైర్మన్ సంజీవ్ కుమార్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి స్పెల్ బి పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో మార్చి1న నిజామాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పెల్‌బీ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో కేటగిరీ1లో ఎం. సంచిత్, కేటగిరీ 2లో వి. తనీష్ రావు, ఎం.సాహితి పాల్గొన్నారు. 3వ తరగతికి చెందిన ఎం. సంచిత్ రాష్ట్ర స్థాయి స్పెల్ బీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. కేటగిరీ 2లో వి. తనీష్ రావు, ఎం.సాహితి “రైజింగ్ స్టార్” అవార్డులు దక్కించుకున్నారు.
రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన సంచిత్‌కు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక లభించింది. వచ్చే ఆదివారం మార్చి 8న హైదరాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభపై పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని విజేతలను అభినందిస్తూ వారి పురోగతికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.




