భారతదేశపు మెడికల్ అద్భుతం
చైనా రోగికి ఏఐఎన్‌యూలో సర్జన్ రోబోటిక్ టెలిసర్జరీ!
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): భారతీయ వైద్య రంగంలో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. భారతదేశపు అతిపెద్ద సింగిల్-స్పెషాలిటీ యూరో/నెఫ్రో హాస్పిటల్ నెట్వర్క్ అయిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి చెందిన సీనియర్ సర్జన్, దాదాపు 3900 కిలోమీటర్ల (వైమానిక దూరం) దూరంలో ఉన్న రోగికి రిమోట్ రోబోటిక్- అసిస్టెడ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
భౌగోళిక సరిహ ద్దులతో సంబంధం లేకుండా నిపుణులైన వైద్య సేవలను అందించడంలో టెలి-సర్జరీ అపారమైన సామర్థ్యాన్ని ఈ విజయం నిరూపించింది. చైనాలోని వ్యూహాన్‌ను, భారత దేశంలోని హైదరాబాద్‌తో అనుసంధానిస్తూ దాదాపు 3900 కిలోమీటర్ల దూరం నుండి ఏఐఎన్‌యు రోబోటిక్, మినిమల్ యాక్సెస్ యూరాలజికల్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ ఎండి. గౌస్ ప్రపంచంలోనే మొట్టమొదటి టెలి-రోబోటిక్ యూరెటరిక్ రీఇంప్లాంటేషన్ శస్త్రచి కిత్సను విజయవంతంగా నిర్వహించారు.
చైనాలోని టోంగ్జీ హాస్పిటల్, ఏఐఎన్‌యు మధ్య జరిగిన చారిత్రాత్మక సహకారానికి ఈ ప్రక్రియ ఒక నిదర్శనం. హైదరాబాద్‌కు చెంది న 57 ఏళ్ల మహిళా రోగి లోయర్ యూరెటరిక్ స్ట్రిక్చర్ (మూత్రనాళం ఇరుకుగా మార డం) కారణంగా తరచూ మూత్రనాళ అడ్డంకులతో బాధపడుతున్నారు. సాధారణ మూత్ర ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి సర్జికల్ బృందం యాంటీ-రిఫ్లక్స్ యూరెటరిక్ రీఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సను చేపట్టింది.
అధునాత న రోబోటిక్ సాంకేతికతను ఉపయోగించి, 100 మిల్లీసెకన్ల కంటే తక్కువ లాటెన్సీ (సమ య విలంబన) తో ఈ సర్జరీని అత్యంత ఖచ్చితత్వంతో, రియల్-టైమ్లో పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స గురించి ఏఐఎన్‌యు బంజారాహి ల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూ రాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి మాట్లాడుతూ: ‘రోబోటిక్ సర్జరీ సంక్లిష్టమైన శస్త్రచికిత్సల విధానాన్ని మార్చివేసింది. ఖచ్చితత్వాన్ని పెంచడంతో పాటు సర్జన్లు త్వరగా నైపుణ్యం సాధించేలా చేస్తోంది అన్నారు.






