31 August, 2026 | 10:22 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

యూరప్ దేశం సైప్రస్‎లో పడవ బోల్తా.. 8 మంది మృతి

31-08-2026 08:58 AM

యూరప్: సైప్రస్ సమీపంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కైరేనియా నుంచి తుర్కియేలోని టౌచుకు వెళ్తుండగా  యాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు ఇప్పటివరకు 237 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు పడవ ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేపట్టాయి.