6 May, 2026 | 10:33 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

భారత్ ఏ మహిళలదే టైటిల్

23-02-2026 01:41 AM

ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్

బ్యాంకాక్, ఫిబ్రవరి 22: మహిళల క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వుమెన్ ఇండియా ఇప్పుడు ఆసి యా స్థాయిలోనూ దుమ్మురేపుతోంది. యు వక్రికెటర్లతో కూడిన జట్లతో నిర్వహించిన ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. తక్కువ స్కోరే చేసినప్పటకీ భారత్ తన అద్భుతమైన బౌలింగ్‌తో దానిని కాపాడుకుంది. బంగ్లాకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసి టైటిల్ సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ మహిళల జట్టు ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు నందిని, వృం ద దినేశ్ 30 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వెంటనే మరో 2 వికె ట్లు కోల్పోయింది.  44 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకోవడంతో స్కోరు 100 అ యినా దాటుతుందా అనిపించింది. ఈ దశలో తేజ, కెప్టెన్ రాధా యాదవ్ కీలక పా ర్ట్‌నర్ షిప్ నెలకొల్పారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఈ క్రమంలో తేజ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రాధా యాద వ్ 36 పరుగులు చేసింది. చివర్లో మరో మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ 20 ఓవర్లలో 134 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో లంక కెప్టెన్ ఫహీమా 4 వికెట్లతో భారత్‌ను దెబ్బతీసింది.

భారీ లక్ష్యం కాకపోవడంతో బంగ్లాదేశ్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. అయితే భారత్ బౌలర్లు మాత్రం లైన్ అండ్ లెంగ్త్‌తో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. షమీమా సుల్తానా (20), షరీమ్‌సుల్తానా(18) మాత్ర మే ఓ మాదిరిగా బ్యాటింగ్ ఆడగలిగారు. మి గిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. భా రత బౌలర్లలో ప్రేమా రావత్ 3 వికెట్లు, తను జా, సోనియా రెండేసి వికెట్లు పడగొట్టారు. సైమా, మిన్ను మణి, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీని భారత్ ఘో రపరాజయంతో ప్రారంభించింది. అనూహ్యంగా యూఏఈ చేతిలో చిత్తుగా ఓడింది. అయితే తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా పాకిస్థాన్, నేపాల్ జట్లపై గెలిసి సెమీస్ చేరింది. ఇక సెమీఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్ ఏ జట్టు టైటిల్ పోరులో బంగ్లాను ఓడించింది.