15 August, 2026 | 2:18 PM

బెల్లంపల్లిలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు

15-08-2026 01:13 PM

- క్యాంపు ఆఫీసు వద్ద ఎమ్మెల్యే వినోద్

- కోర్టులో జడ్జీ శాంతిని సోనీ ఆవిష్కరణ

- ఆర్డీఓ ఆఫీసు వద్ద సబ్ కలెక్టర్ మనోజ్..

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం లో స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వాడవాడల త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ కార్యాయలు,విద్య సంస్థల సముదాయాల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి శాంతిసోని, మునిసిపల్ కార్యాలయం వద్ద చైర్ పర్సన్ దావస్వాతి, సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద మనోజ్, తహసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ కృష్ణ, స్టేట్ బ్యాంక్ వద్ద ఆటో యూనియన్ వద్ద రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఏసీపీ ఆఫీస్ వద్ద కిరణ్ కుమార్,వ్యవసాయ మార్కెట్ భవనం వద్ద మార్కెట్ చైర్మన్ రత్నం సుకుమారి,కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ జండావిస్కరించారు. బీ ఆర్ఎస్ ఆఫీసు వద్ద స్వతంత్ర వేడుకలు జరుపుకున్నారు.మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మువ్వణ్ణ ల జెండాను ఎత్తారు. తిలక్ గ్రౌండ్ వద్ద టీఆర్ఎస్ బెల్లంపల్లి ఇంచార్జీ మాజీ మంత్రి బోడ జనార్ధన్, సీపీఐ, సీపీఎం, టీబిజీకేఎస్, బీజేపీ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తన్నీరు రమేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుముల శంకర్, బండి ప్రభాకర్ యాదవ్, మునిసిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.