24 June, 2026 | 3:31 PM

ఉచిత విత్తనాల పంపిణీ

24-06-2026 02:45 PM

బోథ్ జూన్ 24, (విజయక్రాంతి): మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో బుధవారం ఉచిత విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయ వ్యవస్థను అధికారి కే రామ్ ఆధ్వర్యంలో పాట్నాపూర్ గ్రామంలో నిర్వహించారు గ్రామ సర్పంచ్ పంతం సుగుణ తరత్వాడ సర్పంచ్ ధ్రువ విశ్వేశ్వరరావు ల చేతుల మీదుగా విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను నాటాలని బిల్లులు లేకుండా విక్రయించే విత్తనాలు తీసుకోవద్దని సూచించారు వర్షాలకు అనుకూలమైన పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా సోయాబీన్ కంది విత్తనాలను రైతులకు అందించారు కార్యక్రమంలో వార్డు సభ్యులు  దేవరావు నల్లోల్ల శివన్న పెందుర్ కిషన్ క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.