10 May, 2026 | 1:56 AM

ఈ వారం వార్తల్లో..

10-05-2026 12:00 AM

బెంగాల్‌లో ‘దీదీ’ మార్క్

పశ్చిమ బెంగాల్‌లో దీదీగా పేరొందిన మమతా బెనర్జీ 1970వ దశకంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి, 1998లో టీఎంసీ పార్టీని స్థాపించారు.  2011, 2016, 2021 ఎన్నికలలో వరుసగా విజయం సాధించి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓడటంతో అనేక సవాళ్లను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

నటన నుంచి నాయకుడిగా

వెండితెరపై దళపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్ తమిళనాడులో తన పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు రాలేదు. కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా.. అనేక షరతులు పెట్టాయి. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా లేదా అనే సందేహం కలిగింది. చివరికి చిన్న పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చాయి. మరీ సీఎంగా విజయ్ పాలన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.