8 March, 2026 | 4:59 AM

ఈ వారం వార్తల్లో..

08-03-2026 01:39 AM

దీదీకేనా? పీఠం దక్కేది!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని మళ్లీ గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న ఆ పార్టీకి, రానున్న ఎన్నికల్లోనూ ప్రజలు పట్టం కట్టాలని కోరుకుంటున్నారు.  అదేమీ నల్లేరు మీద నడక కాదు.. బీజేపీ ఆ పార్టీకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఓట్లు రాబట్టేందుకు దీదీ సరికొత్త హామీలు ఇస్తున్నారు. 

సుప్రీం లీడర్ ముందు సవాళ్లు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ మరణం తర్వాత ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడైన మొజ్తాబా ఖమేనీ ఎన్నుకున్నది. నియామకంపై ఇక అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అయితే.. కొత్త సుప్రీం లీడర్ ప్రజల్లో ఉన్న వారసత్వ రాజకీయాలపై వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది.