calender_icon.png 9 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకే

09-02-2026 12:52:39 AM

బీసీలకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

ముషీరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): బుధవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో రాజకీయ పార్టీల అతీతంగా జనరల్ స్థానాలలో ఎన్నికల బరిలో నిలబడిన బీసీలను గెలిపిం చాల ని బీసీ జేఏసీ నిర్ణయించినట్లు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అధ్యక్షతన, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి సమన్వయంతో జరిగింది. ఈ సందర్భంగా బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదంతో కూడిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 116 మున్సిపాలిటీలలో మూడు కార్పొరేషన్‌లలో జరుగుతున్న ఎన్నికలలో ఓటు మనదే సీటు మనదేనన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఓటు వేసి బీసీ బిడ్డలను గెలిపించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, జేఏసీ నేతలు మాదేశి రాజేందర్ గంగపుత్ర, గజ్జల సత్యరాజ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మహేష్ మేరు, నయనంపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.