7 May, 2026 | 3:12 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఇంటర్ పరీక్షల ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య

09-02-2026 12:54 AM

సైనిక్‌పులో విషాద ఘటన, తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు 

కుషాయిగూడ, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) :  పరీక్షల్లో గతంలో విఫలమైన నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్కు లోనైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సైనిక్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం సైనిక్పురి మాధవపురి కాలనీ, డీఎల్‌ఆర్ ఎన్క్లేవ్లో ని సాయి బృందావన్ అపార్ట్‌మెంట్‌లో  భార్య కుక్కల కల్పన, భర్త కె. శ్యాంప్రసాద్ నివా సం ఉంటున్నారు.

వీరికి ఇద్దరు సంతానం కుమార్తె హృషిత (20), కుమారుడు తరుణ్ (15). హృషిత ఇంటర్మీడియట్ చదువుతుం డగా గత సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఈ ఏడాది సప్లి మెంటరీ పరీక్షలకు సిద్ధమవుతూ ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నట్లు తెలిపారు. గత ఫలితాల కారణంగా ఈసారి అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలని కుమార్తెకు సూచించగా, ఆమె అంగీకరించి తన గదిలో చదువుకుంటూ ఉండేదని తల్లి పేర్కొన్నారు.

ఈ నెల 6వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో హృషిత తన గదిలో చదువుకుంటుండగా, భోజనానికి రమ్మని ఎన్నిమార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి బెడ్రూమ్ తలుపు తట్టగా లోపల నుంచి తాళం వేసి ఉన్నట్లు గమనించారని చెప్పారు. ఆపై కిటికీ నుంచి లోపల చూడగా చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఉండటంతో పాటు, మంచం మీద స్టూల్ ఉంచి ఉన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే వాచ్‌మెన్ మధు సహాయంతో కుమార్తెను కిందకు దించి  రాధికా ఎక్స్ రోడ్డ్‌లోని తాత హాస్పిటల్‌కు తరలించారు.

అయితే వైద్యులు పరీక్షించి, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విఫలమైన నేపథ్యంలో ఏర్పడిన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే తన కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లి పేర్కొన్నారు. అనంతరం తల్లి ఫిర్యాదు మేరకు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.