99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు అమలు
- విస్తృతంగా ధీమ్‌ల పట్ల అవగాహన
- ప్రజల భాగస్వామ్యంతో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక
హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీ గా 10 థీమ్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి, ధీమ్‌ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో ఇప్పటివరకు పరిశుభ్రత-ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, ఆరైవ్- ఆలైవ్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.ఈ నెల 26 వరకు సంక్షేమంపై కార్యక్రమాలు జరిగాయి.ఏప్రిల్ 27 నుంచి మే నెల 2 వ తేదీ వరకు పిల్లల భద్రతలో భాగంగా డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయుటకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్థులు, యువత, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
మే 4 నుంచి 10 వరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షే మం, వ్యవసాయాభివృద్ధి, రెవెన్యూ, విద్యు త్, నీటి పారుదల అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభివృద్ధికి విద్య ది క్సూచిగా నిలుస్తుందనే సంకల్పంతో మే 11 నుంచి 16 వరకు విద్య ప్రాధాన్యత, ప్రామాణిక విద్యను అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలుపై విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తారు.
ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో యువ త కీలకపాత్ర పోషిస్తుంది. అందులో భాగం గా క్రీడలకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వ సతులను ఎలా సద్వినియోగం చేసుకోవా లో స్పష్టం చేసేందుకు మే 18 నుంచి 23 వ రకు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మే 25 నుంచి 30 వరకు రాష్ట్రంలో కోటి మం ది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు చేపట్టిన పథకాలపై కార్యక్రమా లు నిర్వహిస్తారు. జూన్ 1 నుంచి 12 వరకు ప ర్యావర ణం ధీమ్‌పై కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ప్రజ ల భాగస్వామ్యాన్ని మరింత పెంచుటకు ప్ర జా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్ర త్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న ది.






