05-02-2026 12:00:00 AM
మేడ్చల్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): ఎల్లంపేట్ మున్సిపాలిటిలోని రావల్ కోల్ గ్రామం లో ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు అక్రమంగా నిర్వహించిన మద్యాన్ని పట్టుకున్నారు. కె.సాయి కుమార్ ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉన్న 12.72 లీటర్ల మద్యం పట్టుబడింది. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, పోలీసు అధికారులు ఈ మద్యాన్ని సీజ్ చేసారు. అనంతరం స్థానిక ఎస్త్స్ర మన్మధ కొనారికి అప్పగించారు.