14 July, 2026 | 3:28 PM

Breaking News

చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •  

తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం

03-04-2026 01:03 PM

రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వివాదం

హామీ పత్రం రాయించుకున్న పోలీసులు

హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్(Toopran)లో ఉద్రిక్తతల మధ్య శ్రీరాముడి రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం సందర్భంగా ఘర్షణలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. రథంపై కూర్చొనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం చేలరేగింది. మున్సిపల్ ఛైర్మన్ రవీందర్ గౌడ్ రథంపై కూర్చొవద్దని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలు తలెత్తనివ్వనని రవీందర్ చేత పోలీసులు హామీ పత్రం రాయించుకున్నారు.