20 August, 2026 | 12:35 PM

అక్రమ రేషన్ బియ్యం గుట్టు రట్టు

20-08-2026 12:00 AM
  1. ఆటో సీజ్, ఇద్దరి అరెస్ట్
  2. వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్

వేములవాడ, ఆగస్ట్ 19, (విజయ క్రాంతి):వేములవాడ రూరల్ మండలం పరిధిలో అక్రమం గా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పిడియస్ బియ్యన్ని వట్టెంల గ్రామం లో ఒక గుడిసెలో నిల్వ చేశారు అనే సమాచారం మేరకు గుంట ఎల్లయ్య గుడిసె లో 20 క్వింటల్లా బియ్యం, రెండు ఆటో లో తరలిస్తున్న 10 క్వింటల్లా బి య్యం మొత్తం 30 క్వింటల్ల బి య్యంను, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమో దు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్త్స్ర వెంకట్రాజం తెలిపారు.

వివరాల ప్రకారం తక్కువ ధర కి పిడిఎస్ బియ్యన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధర కు అమ్ముటకొరకు పిడిఎస్ బియ్యన్ని నల్గొండ వైపు తరలిస్తుండగా ఇద్దరూ వ్యక్తులు వానరసి శ్రీనివాస్, మోతె భాను ప్రసాద్, గుంట ఎల్లయ్యలను అదుపులోకి తీసుకొని రెండు ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం తెలిపారు.పిడియస్ బియ్యం పెద్ద మొత్తంలో పట్టుకున్న వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం, కానిస్టేబుల్ దేవరాజు, సిబ్బందిని వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అభినందించారు.