10 March, 2026 | 8:25 AM

సర్వ మతాలకు సమ ప్రాధాన్యం

10-03-2026 02:15 AM

ముస్లింలకు అండగా కాంగ్రెస్ 

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేటలో ఇఫ్తార్ విందు 

సూర్యాపేట, మార్చి 9 (విజయక్రాంతి): సర్వ మతాలకు సమాన ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సెక్యులరిజానికి పెద్ద పీట వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నన్నారు.

సూర్యాపేటలో ముస్లింల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మంత్రిగా నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదితా లక్షాది , పిసిసి కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పాల్గొన్నారు. కాగా సూర్యాపేట పట్టణంలో నిర్మించనున్న రోడ్లు, భవనముల అతిథి గృహానికి కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ శంకుస్థాపన చేశారు.