13-02-2026 12:45:49 AM
వరంగల్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి లో రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్నారులను అపహరించి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను గత నెలలో టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి నిం దితుల నుండి అపహరణకు గురైన చిన్నారులను రక్షించారు.
రక్షించబడిన కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులను గుర్తించి అప్పగించగా, అపహరణకు గురై రక్షించబడిన పై ఫోటోలోని మరో ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో వున్నారు. నిందితులు ఇ చ్చిన సమాచారంతో ఫోటోలోని చిన్నారులలో ఒకరైన 6 సంవత్సరాల వయస్సు బాబు 2023, అక్టోబర్ నెలలో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నుండి నిందితులు అపహరించినట్లుగా వెల్లడించారు.
మరో ఏడు మాసాల పాపను 2025, ఆక్టోబర్ లో మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసరాల నుండి, అలాగే మరో 5 మాసాల పాపను నిందితులు రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల నుండి అపరిహరించినట్లుగా పోలీసుల విచారణలో తెలియజేసారు. ఈ ముగ్గురు చిన్నారులను ఎవరైన గుర్తించిట్లుయితే కాజీపేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్సె్పక్టర్ సుధాకర్ రెడ్డి, సెల్ నంబర్ 8712685122 సంప్రదించి, తగిన రుజువులు చూపించిన రక్తసంబంధీకులకు చిన్నారులను అప్పగించబడుతుందని కాజీపేట ఇన్స్సె్పక్టర్ తెలిపారు.