25 February, 2026 | 5:50 AM

ఆదర్శం.. ఆరోగ్య పథకాలు

25-02-2026 12:00 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరకు ధన్యవాదాలు
  2. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాలుగా దోహద పడేలా ఆదర్శవంతమైన ఆరోగ్య, బీమా పథకాలను ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

లచ్చిరెడ్డి నేతత్వంలో జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహాలను వేర్వేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వీటి ఆమోదానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు కూడా కతజ్ఞతలు తెలిపారు. ఈ సంద ర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టంలోని ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రభుత్వం రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను వర్తింపచేయడం గొప్ప సాహసమన్నారు.

652 గుర్తిం పు పొందిన ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో 1,998 వ్యాధులకు నగదు రహిత చికి త్సలను పొందే విధంగా వెసులుబాటు కల్పించిందని, దీనికంతటికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కృషి ఫలితమేనని లచ్చిరెడ్డి తెలిపారు. డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియను చేపట్టి నెలలోపే పూర్తి చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా తెలిపారని లచ్చిరెడ్డి వెల్లడించారు.

సీఎం దృష్టికి కంప్యూటర్ ఆఫరేటర్ల సమస్య..

రాష్ర్టంలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న 632 మంది కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు లచ్చిరెడ్డి చెప్పారు. సీఎం సానుకూ లంగా స్పందించారని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు కె రామకష్ణ(డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్ రాములు, రమేష్ పాక, సీహె చ్ శ్రీనివాస్ (తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వి భిక్షం(తెలం గాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డాక్టర్ నిర్మల, ఎల్ దశరథ్ (టీజీసీపీఎస్‌ఈ యూ), గరికె ఉపేందర్‌రావు(జీపీఓ), సుగంధిని (హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డబ్ల్యూ), భూమేష్, సునీల్ ఉన్నారు.