13 June, 2026 | 1:28 PM

జోర్హాట్‌లో విమాన ప్రమాదం: ఇద్దరు పైలట్లు మృతి

13-06-2026 12:04 PM

గువహతి: అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో(Jorhat) శనివారం నాడు ల్యాండ్ అవుతుండగా భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం(IAF Aircraft AN-32 Crashes) కుప్పకూలిందని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రోరియా ప్రాంతంలోని భారత వైమానిక దళ (Indian Air Force) స్థావరంలో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రమాదస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నట్లు అధికారులు సూచించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సిఉందని అధికారులు తెలిపారు.