13 June, 2026 | 1:48 PM

Breaking News

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •   శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు   •  

పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి

13-06-2026 12:27 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ వంతెనల పనులు పూర్తి చేయాలని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శనివారం ఆయన నివాసంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కెరమెరి మండలంలోని ఆనార్పల్లి, లక్మాపూర్ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఉమ్రి క్రాస్ రోడ్ నుండి పరండోలి తండా వరకు బీటీ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి పనులు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు  రమేష్ తెలిపారు.