17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

డంప్ యార్డు ఏర్పాటుకు సంతకం చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

14-04-2026 12:55 AM

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్,ఏప్రిల్13: (విజయక్రాంతి) గత ప్రభుత్వ హయాంలో డంప్ యార్డు ఏర్పాటుకు తాను సంతకం చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దీక్ష శిబిరం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిర్సపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసే పవర్ ప్లాంట్ ఏర్పాటు అయితే సుమారు కరీంనగర్ జిల్లాలో 10 మండలాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

25 ఎకరాలతో కాకుండా 125 ఎకరాలతో ప్రభుత్వం ప్రతిపాదన చేసిందని అన్నారు. దీక్ష శిబిరం నుండి జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటించాలని అఖిలపక్షం నాయకులను కోరారు. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీలకు అతీతంగా పాల్గొనాలన్నారు. అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని, కరీంనగర్ జిల్లాలో 10 మండలాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.

హుజురాబాద్ తోపాటు అన్ని మండలాలలో వంటావార్పులతో రహదారులను దిగ్భందం చేసి బంద్ చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. డంప్ యార్డ్ వల్ల కలిగే నష్టాలను మూడు నియోజకవర్గాలలోని 10 మండలాల్లో ఆటోలతో ప్రచారం చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.