15 April, 2026 | 4:02 AM

దశల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

14-04-2026 06:49 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని ఘనపూర్ గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేంద్ర పేర్కొన్నారు మంగళవారం గ్రామస్తుల కోరిక మేరకు గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ మడవి రమాదేవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు డిసిసి కార్యదర్శులు లోలపు పోశెట్టి హరి సింగ్ నాయకులు నరేందర్ ఎండి సద్దాం మునేశ్వర్ సోమన్న బాసెట్టి సుదర్శన్ భోజరాజు తదితరులున్నారు