2 July, 2026 | 3:17 PM

Breaking News

ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •  

కలెక్టర్ సార్... కరుణించండి

18-11-2025 01:50 PM

తుఫాన్ లో ఒక ఎకరం పూర్తిగా నష్టపోయాను

50,000 నష్టపరిహారం అందించాలని రైతు రవి నాయక్ డిమాండ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు తీరా వరి పైరు కోసే దశలో అకాల ప్రకృతి వైపరీత్యం తుఫాన్ రావడంతో నోటి కాడికి వచ్చిన వరి పైరు పూర్తిగా నేలకొరిగి, తడిసి, విత్తనాలుగా మారాయి. సుమారు రూ.50 వేలతో పంట పెట్టుబడి పెట్టాను పూర్తిగా నష్టపోయానని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండాకు చెందిన లాకావత రవి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పందించి పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.