హిందువులపైకే హైడ్రా!
- పాతబస్తీకేమో ఉచిత కరెంట్
- ఇదే సీఎం రేవంత్‌రెడ్డి నయా విధానం
- ఎక్స్ వేదికగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): హిందువులపైకి హైడ్రాను ప్ర యోగిస్తూ.. పాతబస్తీకేమో ఉచిత కరెంట్ నయా విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపిం చారు. మైనారిటీలను బుజ్జగించడంలో కాంగ్రెస్ దిట్ట అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించా మని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు.
ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమైతే నిబంధనలు పాటించలేదనే కారణంతో చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. పేద కుటుంబాల విషయంలో సానుభూతిని ఎందుకు చూపడం లేదు? అని ప్రశ్నించారు. పాతబస్తీలో మైనారిటీలు కరెంట్ బిల్లులు కట్టరనే ఆరోపణలు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న 200 యూనిట్ల పథకం వల్ల ఎక్కువగా మైనారిటీలకే లబ్ధి చెందుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రామచందర్‌రావు మండిపడ్డారు.
ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఒకవైపు సీఎం పేద హిం దూ కుటుంబాలపై నిబంధనల ఉల్లంఘన పేరుతో హైడ్రాను ప్రయోగిస్తూ.. మరోవైపు మైనారిటీల సంక్షేమం పేరుతో విద్యుత్ బిల్లులు చెల్లించకపోవ డాన్ని సమర్థిస్తున్నారని విమర్శించారు. మరీ హిందూకుటుంబాలపై ఆ సానుభూతి ఏదని ఆయన నిలదీశారు.






