శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
13-09-2025 12:58 PM
- శంషాబాద్ లో హైడ్రా దూకుడు.
- ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రహరిని తొలగించిన హైడ్రా.
- శంషాబాద్ 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ.
- హైడ్రా ఆధికారులకు ఫిర్యాదు.
- ఉదయం నుండి కూల్చీవేతలు.
- అక్రమంగా నిర్మించిన ప్రహరిని కూల్చీవేసి ఫైన్సింగ్ ఏర్పాటు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధిలోని సాతామరాయి సర్వే నంబర్ 217లో 12 ఎకరాల స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేసారు. ఈ భూమిని ప్రభుత్వం 2011లో ఇంటర్మీడియట్ బోర్డుకు కేటాయించింది. ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ ఇటీవల ఆ భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ విషయాన్ని చేపట్టి పోలీసు సిబ్బంది సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరిని కూల్చీవేసిన హైడ్రా ఆధికారులు ఫైన్సింగ్ ఏర్పాటు చేశారు.






