ఆలేరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సోమవారం ఆలేరులో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలని సభ్యులు నిర్ణయించారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా తోట మల్లయ్య, మొరిగాడి మహేష్, అధ్యక్షులుగా మహమ్మద్ ఖుర్షిద్ పాషా, ఉపాధ్యక్షులుగా తునికి జానకిరామ్, ప్రధాన కార్యదర్శిగా జంపాల దశరథ, కోశాధికారిగా ముల్లెక్కల రవి ఎన్నికయ్యారు.
అలాగే కార్యదర్శులుగా చింతకింది వెంకటేష్, పోతుగంటి సంపత్ కుమార్, ప్రచార కార్యదర్శిగా సామల సిద్ధులు, సలహాదారులుగా మంచెన మల్లేశం, సందెన శంకర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేసి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.






