29 July, 2026 | 6:04 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

ఎంఎస్ వ్యాధిగ్రస్తులకు సంఘీభావంగా మానవహరం

01-06-2026 12:52 AM

బంజారాహిల్స్, మే 31 (విజయక్రాంతి): ప్రపంచ మల్టిపుల్ స్క్లేరోసిస్ (ఎంఎస్) బాధితులకు సంఘీభావంగా నగరంలో మానవ హారాన్ని నిర్వహించారు. అందుకు సంబంధించి మల్టిపుల్ స్క్లేరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సిటీ సెం టర్ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సూ ర్యప్రభ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎంఎస్ వ్యాధిగ్రస్తుల జీవితాలపై ఒత్తిడి చూపించే ప్రభావం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యం, ఒత్తిడిని అధిగమించే మా ర్గాలపై విలువైన సూచనలను చేశారు.

అనంతరం కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ బాధితుల పిల్లలు వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తిస్తూ ప్రత్యేక అచీవ్మెం ట్ అవార్డులను ప్రదానం చేశారు. ఫరీదా రాజ్ సహకారంతో రూపొందించిన ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని మాల్లో ప్రదర్శించి సందర్శకులలో అవగాహన కల్పించారు. మాల్కు వచ్చిన సందర్శకులను ఆకట్టుకునే లా ఏర్పాటు చేసిన ప్రత్యక్ష సంగీత ప్రదర్శనతో పాటు ఎంఎస్ హార్ట్ ఫోటో కార్నర్ వద్ద బాధితులు, వైద్యులు కలిసి స్మారక చిత్రాలు దిగారు.

రోష్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాక్ ఇన్ మై షూస్ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ సిమ్యులేటర్ ద్వారా సా ధారణ పౌరులు కూడా ఎంఎస్ బాధితులు ఎదుర్కొనే శారీరక ఇబ్బందులను స్వయం గా అనుభవించి, వారి పరిస్థితిని మరింతగా అర్థం చేసుకున్నారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న వారందరూ ఎంఎస్ వ్యాధి గ్రస్తులకు సంఘీభావంగా మానవహారాన్ని ఏర్పాటు చేసి ఐక్యతను చాటారు.