10 May, 2026 | 8:08 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సిపిఐలో భారీ చేరికలు

29-09-2025 07:55 PM

కూనంనేని సమక్షంలో 220కుటుంబాలు సిపిఐలో చేరిక

సేవల ఫలితంగానే సిపిఐని ఆదరిస్తున్ని నియోజకవర్గ ప్రజలు

నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం/సుజాతనగర్ (విజయక్రాంతి): సుజాతనగర్ మండల సర్వారం, చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండా, పాల్వంచ మండలం దండెలబోర గ్రామాలకు చెందిన 220 కుటుంబాలు ఆదివారం రాత్రి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. వీరికి ఎర్రకండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని అదించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజల కష్టాలు గుర్తించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

గడిచిన ఇరవై నెలల కాలంలో ఎమ్మల్యేగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనునిత్యం క్రమిస్తున్నాని, పరకాల అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో సిపిఐకి తిరుగులేదని, ప్రజలకు అందిస్తున్న సేవలింగా ప్రజ సిపిఐని ఆదరిస్తున్నారని అన్నారు. నూతనంగా పార్టీలో చేరుతున్న వారు ప్రజాసేవలను విస్తరించడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేయాలని, వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, నాయకులు రాంచందర్, బానోతు గోవిందు, మన్నెం వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.